ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులో కత్తితో ఎలా సంచరిస్తున్నారు?: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులో కత్తితో ఎలా సంచరిస్తున్నారు?: రోజా

  • గతంలో రన్ వే పైనే జగన్ ను అడ్డుకున్నారు
  • ఇప్పుడు ఏకంగా ఆయనపై దాడి జరిగింది
  • జగన్ ను అంతమొందించేందుకు యత్నిస్తున్నారు
గతంలో ఇదే వైజాగ్ ఎయిర్ పోర్టులో జగన్ ను రన్ వే పైనే పోలీసు అధికారులు నిర్బంధించారని రోజా గుర్తు చేశారు. లోకల్ పోలీసులు సివిల్ డ్రస్సులో వచ్చి అడ్డుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఏకంగా చాకుతో ఆయనపై ఓ దుండగుడు దాడికి యత్నించాడని మండిపడ్డారు. దీని వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని... ఈ దాడికి యత్నించిన వ్యక్తిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే... సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజకీయంగా జగన్ ను అంతమొందించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఎంతో సెక్యూరిటీ ఉండే ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి కత్తితో ఎలా సంచరిస్తున్నారని అన్నారు. 
jagan
roja
attack

More Telugu News