రాజమౌళి సినిమా నిమిత్తం ఎన్టీఆర్, చరణ్ లకి లాభాల్లో వాటా!
Add ap7am to your home Screen

రాజమౌళి సినిమా నిమిత్తం ఎన్టీఆర్, చరణ్ లకి లాభాల్లో వాటా!

  • రాజమౌళి నుంచి మల్టీ స్టారర్ 
  • 200 రోజులు కేటాయించిన హీరోలు 
  • ఒక్కొక్కరికీ 50 కోట్లు ముట్టే అవకాశం 
'బాహుబలి 2' తరువాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి, భారీ మల్టీ స్టారర్ కి రంగాన్ని సిద్ధం చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా షూటింగు కోసం ఎన్టీఆర్ .. చరణ్ 200 రోజులను కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పారితోషికంగా వాళ్లకి ఎంత మొత్తం ముడుతోందనేది ఆసక్తికరంగా మారింది. అలాగే రాజమౌళి పారితోషికం గురించిన చర్చలు కూడా ఫిల్మ్ నగర్లో నడుస్తున్నాయి. అయితే ఈ సినిమాకిగాను ఎన్టీఆర్ గానీ .. చరణ్ గానీ పారితోషికం తీసుకోవడం లేదట. లాభాల్లో వాటా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాజమౌళికి కూడా లాభాల్లో వాటా దక్కనుంది. లాభాల్లో వాటా అయితే ఒక్కో హీరోకి 50 కోట్ల వరకూ ముట్టే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఎక్కువ రోజులు కేటాయిస్తుండటం వలన, వాళ్ల క్రేజ్ కి తగినట్టుగానే ముడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
ntr
charan

More Telugu News