Balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్?

షార్ట్స్‌లో చూడండి
దివంగత ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రెండు భాగాలుగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహా నాయకుడు' అనే పేర్లతో ఈ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు స్టార్ల పేర్లు, వారి ఫస్ట్ లుక్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తున్నారు. మరి బాలయ్య పాత్రను ఎవరు పోషించనున్నారు? అభిమానులందరిలో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఇది. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఈ పాత్రను పోషిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి.

తాజాగా, ఇప్పుడు మరో సంచలన వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే, బాలయ్య క్యారెక్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే జూనియర్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.
Go Back to Shorts
Balakrishna
junior ntr
tollywood
ntr
biopic

More Telugu News