నిర్మాతగా తప్పుకుంటే రూ. 100 కోట్లు... రాజమౌళి తదుపరి చిత్రం కోసం దానయ్యకు బంపరాఫర్!
- దానయ్య నిర్మాతగా రాజమౌళి తదుపరి చిత్రం
- హీరోలుగా ఎన్టీఆర్, రామ్ చరణ్
- తప్పుకుంటే రూ. 100 కోట్లు ఇస్తానన్న నిర్మాత
రాజమౌళి చిత్రానికి తాను ఎంతైనా పెడతానని చెప్పిన సదరు నిర్మాత, దానయ్య తప్పుకుంటే, రూ. 100 కోట్లను ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. రాజమౌళి తదుపరి చిత్రం షూటింగ్ కూడా ఇంకా ప్రారంభం కానప్పటికీ, దీన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ బయ్యర్లు క్యూలో ఉన్నారు. ఇక దానయ్యకు నిర్మాత ఆఫర్ గురించిన విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఇది నిజమేనంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.