ఎనిమిది రోజుల్లో 135 కోట్లు రాబట్టేసిన 'అరవింద'
Add ap7am to your home Screen

ఎనిమిది రోజుల్లో 135 కోట్లు రాబట్టేసిన 'అరవింద'

  • కొనసాగుతోన్న 'అరవింద' జోరు
  • 131 కోట్లు రాబట్టిన 'జై లవకుశ'
  • 134 కోట్లు వసూలు చేసిన 'జనతా గ్యారేజ్'    
ఎన్టీఆర్ ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. 'అరవింద' ఒక ఎత్తు అనేది ఆయన అభిమానుల మాట. అందుకు తగినట్టుగానే ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతోంది. కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా ఇటు త్రివిక్రమ్ కెరియర్లోనూ .. అటు ఎన్టీఆర్ కెరియర్లోను అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది.

తొలి 4 రోజుల్లో ఈ సినిమా 111.80 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, 'రంగస్థలం' .. 'భరత్ అనే నేను' తొలి వీకెండ్ వసూళ్ల రికార్డులను అధిగమించింది. 8 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతంలో ఎన్టీఆర్ చేసిన 'జై లవ కుశ' సినిమా లాంగ్ రన్నింగ్ లో 131 కోట్లను వసూలు చేసింది. ఇక 'జనతా గ్యారేజ్' కూడా లాంగ్ రన్నింగ్ లో 134 కోట్ల వరకూ రాబట్టింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే 'అరవింద సమేత' 135 కోట్లను వసూలు చేసి రికార్డును సృష్టించింది. మొత్తానికి అరవింద సమేత వీర రాఘవుడు తొలివారంలోనే తన సత్తా చాటేశాడన్న మాట.    
ntr
pooja

More Telugu News