vijay devarakonda: విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' రిలీజ్ డేట్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీ వాలా' చిత్రం రూపొందింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవల్కర్ .. మాళవిక నాయర్ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 ఒక టాక్సీవాలా .. ఒక ప్రేతాత్మ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా కొనసాగుతుంది. ఉత్కంఠభరితమైన .. ఉద్వేగభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందట. తప్పకుండా ఈ సినిమా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ వున్నాడు. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చేస్తోన్న విజయ్ దేవరకొండ, ఆ సినిమా షూటింగ్ పూర్తికాగానే, 'టాక్సీవాలా' ప్రమోషన్స్ లో పాల్గొంటాడని అంటున్నారు.    
Go Back to Shorts
vijay devarakonda
priyanka

More Telugu News