Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  'సినిమా జయాపజయాల ఫలితాన్ని ఎవరో ఒకరికి ఆపాదించడం సమంజసం కాదు..' అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. 'ఒక సినిమా హిట్టయిందంటే అందరి భాగస్వామ్యం ఫలించినట్టే. అలాగే ఫెయిల్ అయిందంటే ఆ బాధ్యత కూడా అందరికీ వర్తిస్తుంది. సక్సెస్ ని ఎలా అయితే అందరూ పంచుకుంటున్నారో, అపజయానికి కూడా అందరూ బాధ్యత వహించాలి. దానికి ఏ ఒక్కరినో బాధ్యులను చేయకూడదు' అని చెప్పింది.  
*  మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రం అమెరికా షెడ్యూలు నిన్న మొదలైంది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. సన్నివేశాలతో పాటు కొన్ని పాటలను కూడా అక్కడి షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్ 2' చిత్రం షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. హీరోలతో పాటు తమన్నా, మెహ్రీన్ కూడా షూటింగులో పాల్గొంటున్నారు.
Go Back to Shorts
Kajal Agarwal
Mahesh Babu
venkatesh
varun

More Telugu News