కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులను కాల్చిచంపిన భద్రతా బలగాలు!
- ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీస్ దుర్మరణం
- శ్రీనగర్ లోని ఫతేహ్ హడల్ లో ఘటన
- ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు
అయితే భద్రతా బలగాల కదలికలను గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. కానీ అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా, ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అమరుడయ్యాడు. ఈ ఘటనలో కొందరు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన అధికారులు, విద్యాసంస్థలను మూసివేశారు.