నటుడు గిరిబాబుకి పితృ వియోగం!
- గిరిబాబు తండ్రి ఎర్ర నాగయ్య కన్నుమూత
- ఆయన వయసు 108 సంవత్సరాలు
- సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు
సినీపరిశ్రమలో గిరిబాబు నిలదొక్కుకోవడం వెనుక ఆయన తండ్రి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. తండ్రి సహకారంతోనే గిరిబాబు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఎర్ర నాగయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఇక గిరిబాబుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు రఘుబాబు కమెడియన్ గా రాణిస్తున్నారు.