ఆ రోజున రోజా నోరుజారింది.. నేనూ జారాను: బండ్ల గణేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ రోజున రోజా నోరుజారింది.. నేనూ జారాను: బండ్ల గణేష్

  • నాకు చాలా బాధనిపించింది
  • నేనేంటో ఆమెకు తెలుసు
  • ఆమె నాకు సోదరి లాంటిది
గతంలో ఓ టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ‘పళ్లు రాలగొడతా’, ‘బ్రోకర్ వి నువ్వు’ అని రోజా.. ‘నీ పళ్లు రాలిపోతాయి’, అంటూ బండ్ల గణేష్ పరస్పరం దూషించుకోవడం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. నాడు చేసిన ఈ వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘మన సోదరి ఏదో నోరు జారింది. నేనేంటో ఆమెకు తెలుసు. ఆ రోజున నేనూ నోరుజారడం జరిగింది. ఆ తర్వాత నాకు చాలా బాధ అనిపించింది... గబుక్కన అంత మాటన్నానే అనిపించింది. ఈ రోజుకి కూడా ఆమె నాకు సోదరి లాంటిదే. ఆ క్షణాన ఆవేశంలో అనుకున్నామేగానీ.. నేను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చారు. ‘మీటూ’ గురించి పలువురు సినీ ప్రముఖులపై వస్తున్న ఆరోపణల గురించి బండ్ల గణేష్ ని ప్రశ్నించగా.. ‘ఈ ఇంటర్వ్యూకు తాను రాజకీయనాయకుడిగా వచ్చాను తప్ప, సినిమా వ్యక్తిగా రాలేదని, కనుక దీనిపై స్పందించనని చెప్పారు.
roja
Bangladesh

More Telugu News