నాపై ఆరోపణలన్నీ అబద్ధాలే: ట్రాన్స్ జండర్ దీపిక భర్త సురేష్
- దీపిక నన్నే మోసం చేసింది
- పెళ్లికి ముందు దీపిక హిజ్రా అని తెలియదు
- బాండ్ రాయించుకున్నానన్నది కూడా అవాస్తవం
- విశాఖలో మీడియా ముందు సురేష్
ఈ విషయంలో విశాఖపట్నంలో మీడియా ముందుకు వచ్చిన సురేష్, దీపిక ఆరోపణలను ఖండించాడు. దీపిక చెబుతున్న అంశాల్లో నిజం లేదని, తానే వాస్తవానికి ఆమె చేతుల్లో మోసపోయానని అన్నాడు. దీపిక ఓ హిజ్రా అన్న సంగతి తనకు పెళ్లికి ముందు తెలియనే తెలియదని చెప్పాడు. ఈ విషయాన్ని దాచి తనకు వివాహం జరిపించారని, పెళ్లికి ముందు తాను బాండ్ రాయించుకున్నానన్న విషయం కూడా అబద్ధమేనని, తన సంతకాలు ఫోర్జరీ చేసి ఓ తప్పుడు బాండ్ ను సృష్టించారని ఆరోపించాడు. తన పరిస్థితి మరెవరికీ రాకూడదని, ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమని సురేష్ చెప్పాడు.