నాంపల్లి కోర్టుకు హాజరైన టీఆర్ఎస్ నేత బాల్క సుమన్!
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటి కేసు
- అనంతరం మీడియాతో ముచ్చటించిన నేత
- కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తే సంతోషమేనని వ్యాఖ్య
అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ ముందు కేసులు అసలు లెక్కలోకే రావని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం 13 ఏళ్ల పాటు పోరాడామనీ, దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తే తనకు సంతోషమేనని వ్యాఖ్యానించారు. అనంతరం అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.