kcr: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి డిపాజిట్ కూడా దక్కదు: వంటేరు ప్రతాపరెడ్డి జోస్యం

షార్ట్స్‌లో చూడండి
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు డిపాజిట్ కూడా దక్కదని టీ- కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి జోస్యం చెప్పారు. గజ్వేల్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. గజ్వేల్ లో నామినేషన్ వేస్తానని, గెలిచి కానుకగా ఇస్తానని అన్నారు. ఈ  సందర్భంగా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతికి పాల్పడలేదని కోట మైసమ్మ ఆలయంలో కేసీఆర్ ప్రమాణం చేయాలని వంటేరు అన్నారు.
Go Back to Shorts
kcr
vanteru
Telugudesam
TRS

More Telugu News