TPCC Uttamkumarreddy: టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుంది : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి టీఆర్‌ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గన్‌పార్క్ వద్ద వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలిసి అమర వీరులకు నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేకి అని ఎందుకు గుర్తుకు రాలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన సీపీఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ సిద్ధాంతాలు ఏమైపోయాయన్నారు. రాయల తెలంగాణ డిమాండ్ చేసిన ఎంఐఎంతో ఎందుకు స్నేహం కొనసాగిస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు తెలంగాణకు మొదటి ద్రోహి కేసీఆర్ అని, టీఆర్‌ఎస్ పార్టీకి బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.