మీటూ ఎఫెక్ట్.. లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన గీత రచయిత వైరముత్తు!
- తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
- ఈ విషయంపై తాను మాట్లాడబోనని వెల్లడి
- సత్యం దానంతట అదే బయటికొస్తుందని వ్యాఖ్య
ఈరోజు వైరముత్తు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘దేశమంతటా ప్రముఖ వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. కావాలని నన్ను అవమానిస్తున్నారు. ఈ తప్పుడు ఆరోపణల గురించి నేను స్పందించను. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది’ అని ట్వీట్ చేశారు. పెదాలపై మజ్జిగ ఉందంటూ తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని వైరముత్తుపై ఓ యువ గాయని ఫిర్యాదు చేసింది. దీన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద బయటపెట్టారు.