వృద్ధిరేటులో చైనాను భారత్ దాటిపోతుంది: ఐఎంఎఫ్ నివేదిక
- ఈ ఏడాది భారత్ 7.3 శాతం వృద్ధిరేటు సాధించొచ్చు
- 2019 లో వృద్ధిరేటు 7.4 శాతానికి పెరిగే అవకాశం
- వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలో వెల్లడి
తమ అంచనాలు నిజమైతే ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా త్వరలోనే తిరిగి భారత్ నిలిచే అవకాశముందని, చైనాను ఈ ఏడాదిలో 0.7 శాతం తేడాతో భారత్ దాటిపోనుందని ఐఎంఎఫ్ పేర్కొంది. చైనాపై అమెరికా విధిస్తున్న సుంకాల ప్రభావమూ ఆ దేశ వృద్ధిరేటుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ నివేదికలో తెలిపింది. ఈ ఏడాది చైనా 6.6 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధించే అవకాశం ఉందని, 2019లో అది 6.2 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ఆ నివేదికలో తెలిపింది.