ట్విట్టర్ లో టాలీవుడ్ ప్రిన్స్ జోరు.. 70 లక్షలకు చేరుకున్న మహేశ్ బాబు ఫాలోవర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్విట్టర్ లో టాలీవుడ్ ప్రిన్స్ జోరు.. 70 లక్షలకు చేరుకున్న మహేశ్ బాబు ఫాలోవర్లు!

  • 2010లో ట్విట్టర్ ఖాతా తెరిచిన మహేశ్
  • ఎనిమిదేళ్లలోనే 70 లక్షల ఫాలోవర్స్
  • ఆనందంలో ఫ్యాన్స్ 
వైవిధ్యభరితమైన కథాంశాలు ఉన్న సినిమాలను చేయడమే కాదు.. అటు అభిమానులను సంపాదించుకోవడంలోనూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుంటాడు. కేవలం సినిమాలే కాకుండా తన ఫ్యామిలీ అప్ డేట్స్ ను కూడా మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా మహేశ్ బాబు మరో ఘనత సాధించాడు. మహేశ్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నవారి సంఖ్య తాజాగా 70 లక్షలకు చేరుకుంది. 2010లో మహేశ్ బాబు ఈ అకౌంట్ ను ప్రారంభించారు.

తమ హీరోకు ట్విట్టర్ లో భారీగా ఫాలోయింగ్ రావడంపై మహేశ్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాజాగా 70 లక్షల ఫాలోవర్లతో  మహేశ్ హీరోలు ధనుష్, అల్లు అర్జున్ లను దాటేశాడు. ప్రస్తుతం మ‌హేష్ మ‌హర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
Mahesh Babu
FANS
Twitter
70LAKH

More Telugu News