ntr: అదే ఎన్టీఆర్ లోని గొప్పదనం: పూజా హెగ్డే

షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన పూజా హెగ్డే, ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా బృందానికి ధన్యవాదాలు తెలియజేసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాపై నమ్మకంతో నాకు 'అరవింద' పాత్రను ఇచ్చారు. ఆయన సెట్లో చాలా ప్రశాంతంగా ఉండటం వలన షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఆయనతో కలిసి మరోసారి పని చేయాలని వుంది. ఇక ఎన్టీఆర్ అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, సెట్లో అందరితో కలివిడిగా వుంటారు. ఎలాంటి సీన్ అయినా ఒకటి రెండు టేక్స్ లోనే ఆయన చేసేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది .. అదే ఆయనలోని గొప్పదనం. చినబాబు .. వంశీ ఇద్దరూ కూడా చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Go Back to Shorts
ntr
pooja hegde

More Telugu News