కేటీఆర్ అలాంటి పనులు చేయబోరు: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

కేటీఆర్ అలాంటి పనులు చేయబోరు: విజయ్ దేవరకొండ

  • కేటీఆర్ ఫొటోలకు ఫోజులిచ్చే వ్యక్తి కాదు
  • తప్పు చేసే పార్టీలకే 'నోటా' భయం
  • కేటీఆర్ స్టయిల్ ను చిత్రంలో చూపామన్న విజయ్
తప్పు చేసే రాజకీయ పార్టీలకు మాత్రమే 'నోటా' అంటే భయం ఉంటుందని, మిగతా పార్టీలన్నీ, సినిమాను చూసి ఎంజాయ్ చేస్తాయని వ్యాఖ్యానించాడు విజయ్ దేవరకొండ. 'నోటా' సినిమా కోసం తాను తెలంగాణ యువనేత కేటీఆర్ స్టయిల్ ను ఫాలో అయ్యానని, కొన్ని చోట్ల ఆయన లుక్స్ ను డిటో దింపామని చెప్పాడు. కేటీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన ఫొటోలకు పోజులిచ్చే టైపు కాదని అన్నాడు.

ఉదాహరణకు చాలా మంది రాజకీయ నాయకులు ప్లాస్టిక్ నిషేధం రోజున, మీడియాను పిలిచి, ప్లాస్టిక్ వాడకంపై లెక్చర్ ఇచ్చి, ఆ మరుసటి రోజు ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగుతారని, కేటీఆర్ అటువంటి పనులు చేసే వ్యక్తి కాదని అన్నాడు. చేసే పని ఫొటోల కోసం కాదని, చెప్పిన దాన్ని మించి చేయాల్సిన స్థానంలో ఉన్నామని గుర్తించిన వ్యక్తి కేటీఆర్ అని అన్నాడు. అటువంటి రాజకీయ నాయకుడిని చూడటం తనకు కొత్తగా అనిపించిందని పొగడ్తల వర్షం కురిపించాడు.
Vijay Devarakonda
NOTA
KTR

More Telugu News