తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న '96'
- తమిళంలో ఈ రోజే విడుదలైన '96'
- విజయ్ సేతుపతి జోడీగా త్రిష
- దిల్ రాజు చేతికి తెలుగు రీమేక్ రైట్స్
ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటని అంటున్నారు. విడుదలకి ముందే ఈ సినిమా చూసిన దిల్ రాజు, ఇది తప్పకుండా హిట్ కొడుతుందని భావించారు. అందువల్లనే ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తో తిరిగి వచ్చారు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనులను ఆయన అప్పుడే ఆరంభించేశారు. కొంతకాలంగా నిర్మాతగా దిల్ రాజు వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నారు. తమిళంలో '96' హిట్ టాక్ తెచ్చుకోవడంతో, తెలుగులో దిల్ రాజు కూడా హిట్ కొట్టనున్నాడని చెప్పుకుంటున్నారు.