వారసత్వ హీరోల గురించి విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

వారసత్వ హీరోల గురించి విజయ్ దేవరకొండ

  • వారసత్వ హీరోలకి ఆల్రెడీ ఫ్యాన్స్ వుంటారు 
  • నాకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదు
  • ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'నోటా' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజాగా ఆయనకి వారసత్వ హీరోలను గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో ఈ విషయంపై ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

"సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం. డబ్బులు పెట్టే నిర్మాతలు .. ఆ డబ్బు ఎంతవరకూ వెనక్కి వస్తుందనే విషయంలో భరోసా చూసుకుంటారు. వారసత్వ హీరోలకి ఆల్రెడీ ఫ్యాన్స్ వుండటమనేది వాళ్లకి కలిసొచ్చే అంశం. అందువలన నిర్మాతలు అది సేఫ్ జోన్ గా భావిస్తారు. కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్ అనుకుంటారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండగా వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం చాలాకష్టం. ఏడాదికి నాలాంటి వాళ్లు ఒకరిద్దరు ఇక్కడ కుదురుకుంటారేమో" అంటూ చెప్పుకొచ్చాడు. 
vijay devarakonda

More Telugu News