నారా లోకేష్ శాఖలో కుంభకోణం.. కోర్టుకు వెళతాం: బీజేపీ ఎంపీ జీవీఎల్
- వేల కోట్ల ధనాన్ని దోపిడీ చేశారు
- ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పాలి
- ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలి
ఐటీ శాఖలో జరిగిన అక్రమాలపై కోర్టుకు వెళతామని చెప్పారు. ఐటీ శాఖలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో లోకేష్ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. అనేక సంస్థలను తీసుకొచ్చారని, ఉద్యోగాలు ఇవ్వకుండానే కోట్లు దండుకున్నారని విమర్శించారు. నామమాత్రపు ధరకు భూములు ఇచ్చి... మూడేళ్ల తర్వాత కమర్షియల్ రేట్లకు అమ్ముకోవచ్చనే ఆఫర్ ఇచ్చారని తెలిపారు.