మహేశ్ బాబు వల్లే బిగ్‌బాస్‌లోకి: కౌశల్
- ‘రాజకుమారుడు’ నుంచి మహేశ్‌తో పరిచయం
- మోడలింగ్ అకాడమీ ఏర్పాటులో ప్రోత్సాహం
- లేదంటే వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినే
తాను బిగ్‌బాస్‌కు వచ్చానంటే దానికి కారణం మహేశ్ బాబేనని కౌశల్ అన్నాడు. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది తానేనన్న కౌశల్.. అందుకోసం మహేశ్ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి అకాడమీని ఏర్పాటు చేయించినట్టు చెప్పాడు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఎంతో సాయం చేశారని పేర్కొన్నాడు. ఆ ఏజెన్సీ లేకపోతే తానెప్పుడో తిరిగి వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినన్నాడు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు.