సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాజల్ లో కనిపించే రెండు కోణాలు! 
  • మహేశ్ బాబు 'మహర్షి' అప్ డేట్స్ 
  • ఇటలీలో షూటింగ్ చేస్తున్న ప్రభాస్ 
*  'బయట కనిపించే కాజల్ కీ, ఇంట్లో కనిపించే కాజల్ కీ చాలా తేడా వుంటుంది' అంటోంది అందాల నాయిక కాజల్ అగర్వాల్. 'కెమెరా ముందు కనిపించే కాజల్ వేరు.. మా ఇంట్లో కనిపించే కాజల్ వేరు. ఇంట్లో చాలా సాధారణంగా వుంటాను. అమ్మా నాన్న, స్నేహితులతో కబుర్లే కబుర్లు. ఒక్క సినిమాల గురించి తప్ప మిగతా అన్ని విషయాలూ మాట్లాడుకుంటాం' అని చెప్పింది.
*  మహేశ్ బాబు నటిస్తున్న 25వ చిత్రం 'మహర్షి' తాజా షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 15 నుంచి అమెరికాలో జరుగుతుంది. మూడు వారాల పాటు జరిగే ఈ షూటింగులో కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది.
*  'సాహో' చిత్రంతో పాటుగా ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ పిరీడ్ డ్రామాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
Kajal Agarwal
Mahesh Babu
Prabhas

More Telugu News