Biggboss: బిగ్ బాస్ ఫినాలే... చీఫ్ గెస్టుగా వచ్చి అదిరిపోయే స్పీచ్ ఇచ్చిన హీరో వెంకటేష్!

షార్ట్స్‌లో చూడండి
నేటితో బిగ్ బాస్ సీజన్-2 ముగియనుంది. నేడు ఫైనల్ ఫినాలే జరుగనుండగా, ఆ ఎపిసోడ్ ను నిన్ననే 'స్టార్ మా' యాజమాన్యం చిత్రీకరించగా, షోలో ప్రేక్షకులుగా పాల్గొన్న యువతీ యువకుల నుంచి ఎన్నో లీక్ లు వస్తున్నాయి. ఈ గ్రాండ్ ఫినాలేలో విజేతను తొలి సీజన్ హోస్ట్ ఎన్టీఆర్ ప్రకటిస్తారని తొలుత ఊహాగానాలు వచ్చినప్పటికీ, నిన్న సెట్స్ కు వచ్చింది ఆయన కాదట. విక్టరీ వెంకటేష్ వచ్చి, బిగ్ బాస్ సీజన్-2 విజేతను స్వయంగా ప్రకటించారని, ఈ సందర్భంగా ఆయన అదిరిపోయే స్పీచ్ ఇచ్చారని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్ విజేతగా కౌశల్ ను ప్రకటించింది వెంకటేష్ అని తెలుస్తుండగా, అసలు కార్యక్రమం చూసేందుకు మాత్రం నేటి రాత్రి వరకూ ఆగాల్సిందే.
Go Back to Shorts
Biggboss
Venkatesh
Finale
Koushal

More Telugu News