అమెరికాలో 'నవాబ్' హల్ చల్
- ఈ నెల 27న వచ్చిన 'నవాబ్'
- ఆసక్తికరమైన కథాకథనాలు
- బలమైన తారాగణం
మాఫియా నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య సాగే పోరాటంగా ఈ కథ తెరకెక్కింది. కథలోని కొత్తదనం వలన .. కథనంలోని ఆసక్తి కారణంగా ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. తొలిరోజున ఈ సినిమా భారీ వసూళ్లనే రాబట్టినట్టుగా చెబుతున్నారు. అమెరికాలో తొలిరోజున ఈ సినిమా 1.25 కోట్లను వసూలు చేయడం విశేషమేనని అంటున్నారు. బలమైన కథాకథనాలు ..బలమైన తారాగణం ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.