హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం.. కారుపైకి దూసుకొచ్చిన తారాజువ్వలు!
- సంగారెడ్డి పర్యటన సందర్భంగా ఘటన
- స్వాగతిస్తూ బాణసంచా కాల్చిన కార్యకర్తలు
- మంత్రి కాన్వాయ్ పైకి దూసుకెళ్లిన తారాజువ్వలు
సంగారెడ్డిలో జరిగిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యేందుకు హరీశ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు వచ్చారు. దీంతో మంత్రి హరీశ్ ను స్వాగతిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచాను పేల్చాయి. ఈ సందర్భంగా 2-3 తారా జువ్వలు పైకి పోకుండా కాన్వాయ్ వైపు దూసుకొచ్చాయి. ఓ రాకెట్ మంత్రి కారును తాకింది.
ఈ సందర్బంగా మంటలు చెలరేగడంతో కార్యకర్తలు బైక్ లను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. కార్యకర్తలు కాల్చిన టపాసులు 3 నిమిషాల పాటు పేలాయి. అంతసేపు కారులోనే ఉండిపోయిన హరీశ్.. ఆ తర్వాత కారు దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.