'దిల్ రాజు నిర్మాతగా '96' తెలుగు రీమేక్
Add ap7am to your home Screen

'దిల్ రాజు నిర్మాతగా '96' తెలుగు రీమేక్

  • ప్రేమకథా చిత్రంగా '96'
  • త్రిష జోడీగా విజయ్ సేతుపతి 
  • ఈ నెల 4న తమిళంలో రిలీజ్      
తమిళంలో నందగోపాల్ నిర్మాణంలో .. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో '96' సినిమా రూపొందింది. త్రిష .. విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను అక్టోబర్ 4వ తేదీన అక్కడ విడుదల చేస్తున్నారు. 1996లో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

ఇటీవల చెన్నై వెళ్లి స్పెషల్ స్క్రీనింగ్ లో ఈ సినిమాను చూసిన దిల్ రాజు, తెలుగు రీమేక్ రైట్స్ ను కోటి రూపాయలకు దక్కించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అది నిజమేనంటూ తాజాగా దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. '96' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాము. నటీనటులు .. సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాము అని తెలియజేశారు. త్రిష .. విజయ్ సేతుపతి పాత్రలను తెలుగులో చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.      
trisha
vijay sethupathi

More Telugu News