ఇకపై ఏ పెళ్లికీ నన్ను పిలవకండి ప్లీజ్!: తమిళ హీరో విజయ్
- విజయ్ కి విపరీతమైన క్రేజ్
- పెళ్లికి వెళితే ఎగబడిన జనం
- ఇకపై అలా జరగకూడదని నిర్ణయం
ఇక ఇటీవల పాండిచ్చేరిలో జరిగిన ఒక పెళ్లికి ఆయన వెళ్లాడు. ఆ పెళ్లికి విజయ్ వస్తోన్న విషయం తెలిసి, వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో విజయ్ కి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. పెళ్లికి వచ్చిన బంధువులకి కూడా బాగా ఇబ్బంది అయింది. దాంతో ఇకపై తాను ఏ పెళ్లికీ వెళ్లకూడదని విజయ్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. తప్పదు అనుకుంటే తనే ఆ జంటను ఇంటికి ఆహ్వానించి గిఫ్ట్ ను అందజేయాలనీ .. ఫోటో సెషన్ జరపాలని .. ఆ దిశగా ఏర్పాట్లు చేయిస్తున్నాడట.