ఎన్టీఆర్ తో ఒక రేంజ్ సాంగ్ చేశాను: జానీ మాస్టర్
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ తో ఒక రేంజ్ సాంగ్ చేశాను: జానీ మాస్టర్

  • పాట చిత్రీకరణను పూర్తి చేసిన త్రివిక్రమ్ 
  • అవుట్ పుట్ పట్ల సంతృప్తి చెందిన ఎన్టీఆర్
  • ఆనందంగా ఉందన్న జానీ మాస్టర్
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో, ఇటీవల ఆ పాట చిత్రీకరణను కూడా పూర్తి చేశారు. ఈ పాటకి జానీ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించాడు. గతంలో ఎన్టీఆర్ కి ఆయన కంపోజ్ చేసిన డాన్సులకి మంచి మార్కులు పడ్డాయి. కొంత గ్యాప్ తరువాత ఆయన ఎన్టీఆర్ పాటకి కొరియోగ్రఫీని అందించాడు.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. "చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ గార్లతో కలిసి పనిచేశాను. ఎన్టీఆర్ కి నేను కంపోజ్ చేసిన సాంగ్ అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సంతృప్తి చెందడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీ అందరి కంటే ఎక్కువగా ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వివరాలను ప్రకటించనున్నారు .   
ntr
pooja hegde

More Telugu News