surya: తెలుగు, తమిళ భాషల్లో రూపొందే మల్టీ స్టారర్లో విజయ్ దేవరకొండ?

షార్ట్స్‌లో చూడండి
తెలుగులో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ, తమిళనాట కూడా క్రేజ్ తెచ్చుకుని మార్కెట్ పెంచుకునే ఆలోచనలో వున్నాడు. అందులో భాగంగానే ఆయన 'నోటా' సినిమా చేశాడు. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా వచ్చేనెల 5వ తేదీన విడుదల కానుంది. రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ గట్టి నమ్మకంతో వున్నాడు.

ఇదిలా ఉంచితే, త్వరలో తమిళ హీరో సూర్యతో కలసి విజయ్ దేవరకొండ ఓ మల్టీ స్టారర్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.  
Go Back to Shorts
surya
vijay devarakonda

More Telugu News