దుమ్మురేపేస్తోన్న 'నవాబ్' ట్రైలర్
- నలుగురు హీరోలుగా 'నవాబ్'
- యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట
- ఈ నెల 27వ తేదీన భారీ రిలీజ్
అరవింద్ స్వామి .. అరుణ్ విజయ్ .. శింబు .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నలుగురు కథానాయకులు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. సహజత్వానికి దగ్గరగా మలచిన సన్నివేశాలు మనసుకు పట్టుకునేలా వున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.