'గీత గోవిందం'లో అదొక అద్భుతమైన ట్విస్ట్: పరుచూరి గోపాలకృష్ణ
Add ap7am to your home Screen

'గీత గోవిందం'లో అదొక అద్భుతమైన ట్విస్ట్: పరుచూరి గోపాలకృష్ణ

  • హీరోయిన్ తో హీరో బస్సు ప్రయాణం 
  • అనుకోకుండా ఆమెకి లిప్ కిస్ ఇస్తాడు 
  • ఆమె తన అన్నయ్యకి ఫోన్ చేస్తుంది  
తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'గీత గోవిందం' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమా చూస్తే దర్శకుడు స్క్రీన్ ప్లేను ఎంత పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాడనేది అర్థమవుతుంది. హీరోయిన్ తో కలిసి హీరో బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన వలన, నిద్రలో వున్న హీరోయిన్ కి లిప్ టు లిప్ కిస్ ఇచ్చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి లేచి అతని చెంప పగలగొట్టడం .. వాళ్ల అన్నయ్యకి ఫోన్ చేయడం జరిగిపోతాయి.

హీరో ఆ అమ్మాయితో కలిసి బస్సు దిగుతాడు .. ఆ అమ్మాయి వాళ్ల అన్నయ్య వచ్చి చితగ్గొడతాడు అని అంతా అనుకుంటారు. కానీ మనమెవరూ ఊహించనట్టుగా హీరో బస్సు అద్దం పగలగొట్టేసి దూకేస్తాడు. ఈ కథనం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ వెంటనే మరో పెద్ద ట్విస్ట్ ఇవ్వడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఏ హీరోనైతే కొడదామని హీరోయిన్ అన్నయ్య అనుకున్నాడో .. ఆ హీరో చెల్లెలినే అతను పెళ్లి చేసుకోబోతున్నాడనే ట్విస్ట్ ఇచ్చాడు. అలా అందరిలో ఉత్కంఠను పెంచుకుంటూ వెళ్లాడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు" అని చెప్పుకొచ్చారు.
vijay devarakonda
rashmika mandana

More Telugu News