venkatesh: వెంకటేశ్ కూడా కన్ఫ్యూజ్ అయ్యారట!

షార్ట్స్‌లో చూడండి
'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఆయన మనవడు సుమంత్ పోషిస్తున్నాడు. నిన్న అక్కినేని నాగేశ్వరరావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ను రిలీజ్ చేశారు. మధ్య వయసులో అక్కినేని ఎలా ఉండేవారో .. సుమంత్ కూడా అచ్చు అలాగే వున్నాడు.ఈ పోస్టర్ చూసినవాళ్లు అందులో వున్నది అక్కినేని నాగేశ్వరరావేనని క్షణకాలం పాటు పొరపడ్డారు. అలాగే తాను కూడా కన్ఫ్యూజ్ అయ్యానని హీరో వెంకటేశ్ చెప్పారు. 'ఎన్టీఆర్' బయోపిక్ లో అక్కినేనిగా సుమంత్ లుక్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ పోస్టర్లో వున్నది సుమంత్ అనే స్పష్టత రావడానికి నాకు కొంచెం సమయం పట్టింది. అక్కినేని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినవాడిలా సుమంత్ కనిపిస్తున్నాడు. ఏఎన్నార్ చాలా గొప్పవ్యక్తి .. అలాంటి లెజెండ్ ను ప్రత్యక్షంగా చూసినట్టుగా అనిపించింది' అని అన్నారు.       
Go Back to Shorts
venkatesh
sumanth

More Telugu News