చెట్టు కింద వాహనాన్ని ఆపి చిందేసిన పోలీసులు.. వీడియో వైరల్!
- భోజ్‌పురి పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసిన పోలీసులు
- కేరింతలు కొడుతూ ప్రోత్సహించిన యువకులు
- విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు
ఉత్తరప్రదేశ్‌లోని ఔర్యా జిల్లాలో జరిగిందీ ఘటన. వాహనంలో వచ్చిన పోలీసులు ఓ చెట్టు కింద దానిని పార్క్ చేసి భోజ్‌పురి పాటలు పెట్టుకున్నారు. వాటికి అనుగుణంగా ఆనందంగా స్టెప్పులేశారు. ముగ్గురు పోలీసులు యూనిఫాంలో ఉండి చిందులేస్తుండగా, మరికొందరు యువకులు వారిని ప్రోత్సహిస్తూ స్టెప్పులేయడం వీడియోలో కనిపించింది.
వీడియోలో ఉన్న పోలీసులను బ్రజేశ్ కుమార్, సుబోధ్, కుల్దీప్‌లుగా అధికారులు గుర్తించారు. వారితో కలిసి డ్యాన్స్ చేసిన యువకులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే, బ్రజేశ్ కుమార్ అనే పోలీసు తన మేనల్లుడి పుట్టిన రోజు సందర్భంగా అందరికీ స్వీట్లు పంచి ఇలా ఆనందంగా స్టెప్పులేసినట్టు తెలుస్తోంది.