రూ.. 4,500 జరిమానా కట్టలేని మందుబాబుకు 37 రోజుల అదనపు జైలు శిక్ష!
- మహబూబ్ నగర్ లో డ్రంకెన్ డ్రైవ్
- పూటుగా తాగి దొరికిపోయిన వ్యక్తి
- 67 రోజుల జైలుశిక్ష విధించిన న్యాయమూర్తి
వారిని విచారించిన న్యాయమూర్తి తేజో కార్తీక్, ఓ వ్యక్తి విపరీతంగా తాగి, వాహనం నడిపినట్టు గుర్తించి, అతనికి నెల రోజుల జైలుశిక్ష, రూ. 4,500 జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆపై తాను జరిమానా చెల్లించలేనని చెప్పడంతో మరో 37 రోజుల అదనపు జైలుశిక్ష విధిస్తున్నట్టు తీర్పిచ్చారు. మరో వాహనదారుడికి 10 రోజుల జైలుశిక్ష, రూ. 2,500 జరిమానా, మిగతా ముగ్గురికీ ఐదు రోజుల జైలుశిక్షను, రూ. 3 వేల చొప్పున జరిమానాను విధించారు.