mammootty: వైఎస్ జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ?

షార్ట్స్‌లో చూడండి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఏ హీరో నటించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. సూర్య గానీ .. కార్తీ గాని జగన్ పాత్రలో కనిపించవచ్చనే టాక్ వచ్చింది.

తాజాగా ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో ఇప్పుడు యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. రాజకీయాల నేపథ్యంలో ఆయన చేస్తోన్న 'నోటా' పట్ల కూడా అంతా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. అందువలన జగన్ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది. వై ఎస్ జగన్ పాత్రకి విజయ్ దేవరకొండ కరెక్టుగా సెట్ అవుతాడనే బలమైన నమ్మకం కూడా ఉండటంతో, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.   
Go Back to Shorts
mammootty
vijay devarakonda

More Telugu News