మాజీ సీఎం టంగుటూరి అంజయ్య భార్య మణెమ్మ కన్నుమూత!
- అపోలో ఆసుపత్రిలో కన్నుమూత
- అనారోగ్యంతో బాధపడుతున్న మణెమ్మ
- రెండు సార్లు ఎంపీ, ఓ సారి ఎమ్మెల్యేగా బాధ్యతలు
1942, ఏప్రిల్ 29న ఆమె హైదరాబాద్ లో జన్మించారు. చాదర్ ఘాట్ లోని మార్వాడి హిందీ విద్యాలయలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.1960లో టంగుటూరి అంజయ్యను ఆమె పెళ్లాడారు. అంజయ్య-మణెమ్మ దంపతులకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మణెమ్మ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. అంజయ్య కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను నేతలు కొనియాడారు.