డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది: వైసీపీ ఎమ్మెల్యే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైంది: వైసీపీ ఎమ్మెల్యే రోజా

  • డ్వాక్రా రుణాల మాఫీపై వైసీపీ సభ్యులు ప్రశ్నించారు
  • మంత్రి పరిటాల సునీతకు లేఖ రాశాం
  • రుణాలు మాఫీ చేయలేదని సునీత చెప్పారు
డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం బట్టబయలైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు చేసిన ఓ ట్వీట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. డ్వాక్రా రుణాల మాఫీపై లేఖ ద్వారా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు.. ఎటువంటి రుణాలు మాఫీ చేయలేదని మంత్రి పరిటాల సునీత లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారని, 2014 నాటికి ఉన్న రుణాలపై ఎటువంటి మాఫీ చేయలేదని వెల్లడించారని రోజా చెప్పారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు రుణమాఫీ చేసే ఆలోచన లేదని సభలో సమాధానమిచ్చారని ఆ ట్వీట్ లో రోజా తెలిపారు.
dwacra
roja
paritala sunita

More Telugu News