లోపం తనలో పెట్టుకుని భార్యపై నిందలు... న్యూడ్ ఫొటోలు తీసి వేధిస్తున్న టెక్కీ!

తన భవిష్యత్తుపై ఎన్నో అంచనాలతో అత్తారింటికి వచ్చిన ఓ నవ వధువుకు తొలిరాత్రే పిడుగులాంటి వార్త తెలిసింది. తాను సంసారానికి పనికిరానని చెప్పిన భర్త, ఆమె నగ్న చిత్రాలను తీసి, తన లోపాన్ని బయటకు చెబితే, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు దిగి, చిత్ర హింసలు పెడుతుంటే, ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేంద్రప్రసాద్ కు గత సంవత్సరం ఆగస్టులో వివాహమైంది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు రూ. 45 లక్షల కట్నాన్ని సమర్పించుకున్నారు.

అయితే, రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడన్న విషయాన్ని దాచిపెట్టిన ఆయన తల్లిదండ్రులు, ఈ పెళ్లి చేసి తమ చేతులు దులుపుకున్నారు. ఆపై విషయం తెలుసుకున్న యువతి, బయటకు చెప్పుకోలేక లోలోపలే మధనపడింది. అత్తమామలకు విషయాన్ని చెబితే, వారు కూడా ఆమెను బెదిరించారు. తమ కోడలికి టీబీ ఉందని ప్రచారం చేశారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. ఏడాదిపాటు ఈ దారుణాన్ని భరించిన ఆమె, ఇక లాభం లేదని పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Go Back to Shorts
Nude Photos
Anantapur District
Rayadurgam
Techchie

More Telugu News