ప్రేమ పెళ్లే చేసుకుంటాను: విజయ్ దేవరకొండ
Add ap7am to your home Screen

ప్రేమ పెళ్లే చేసుకుంటాను: విజయ్ దేవరకొండ

  • 35 యేళ్లకి పెళ్లి చేసుకుంటాను 
  • ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయైనా కావొచ్చు
  • నచ్చిన అమ్మాయి తారసపడలేదు  
విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'గీత గోవిందం' తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ' ప్రేమపెళ్లి చేసుకుంటారా .. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా?' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు ఆయన స్పందిస్తూ .. "ఒకప్పుడు నేను 40 సంవత్సరాలకి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను .. కానీ ఇప్పుడు దానిని 35కి తీసుకొచ్చేశాను. ఇక ఎప్పటికైనా ప్రేమపెళ్లే చేసుకుంటాను .. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. తెలంగాణ అమ్మాయినే చేసుకోవాలి .. ఆంధ్ర అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనేం లేదు. ప్రపంచంలో ఎక్కడ వున్నా నాకు కనెక్ట్ కాగలిగితే చాలు. ఇంతవరకూ నాకు నచ్చిన అమ్మాయైతే తారసపడలేదు" అని చెప్పుకొచ్చాడు. 
vijay devarakonda

More Telugu News