రోజాపై నాయుడుగారికి కోపం వచ్చిందనుకుంటా: పరుచూరి గోపాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజాపై నాయుడుగారికి కోపం వచ్చిందనుకుంటా: పరుచూరి గోపాలకృష్ణ

  • అప్పుడు రోజా ఫుల్ బిజీగా వుంది 
  • తెలుగు .. తమిళ సినిమాలు చేస్తోంది 
  • ఆ సమయంలోనే నాయుడుగారు ఫోన్ చేశారు
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో తాజాగా పరుచూరి గోపాలకృష్ణ .. రోజాను గురించిన విషయాలను చెప్పుకొచ్చారు. 'పోకిరి రాజా' సినిమా కోసం రోజాను అనుకుంటే, బిజీగా ఉండటం వలన ఆమె నో చెప్పేసింది. ఆ నిర్మాత రామానాయుడుగారి ద్వారా ఫోన్ చేయించినా ఆమె వున్న పరిస్థితుల కారణంగా ఎస్ చెప్పలేకపోయింది. నిజంగానే ఆ సమయంలో రోజా తెలుగులో పది సినిమాలు .. తమిళంలో ఆరు .. ఏడు సినిమాలు చేస్తోంది.

ఒక హీరోయిన్ ఇన్ని సినిమాలను వరుసగా చేసుకుంటూ వెళుతుండటం అంత తేలికైన విషయం కాదు. అయినా నా మాట కాదనలేక ఆమె డేట్స్ సర్దుబాటు చేసుకుని, 'పోకిరి రాజా' సినిమా చేసింది. ఆ తరువాత మీరు గమనిస్తే .. నాయుడుగారి సినిమాల్లో మళ్లీ రోజా కనిపించలేదు. తను చెబితే వినిపించుకోలేదని బహుశా నాయుడిగారికి కోపం వచ్చిందేమో. ఏదేమైనా రోజా మనసు చాలా మంచిది .. ఇప్పటికీ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే వుంది. ఆమెకి మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.   
paruchuri
roja

More Telugu News