'పందెం కోడి 2' నుంచి ఫస్టు టీజర్ వచ్చేస్తోంది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పందెం కోడి 2' నుంచి ఫస్టు టీజర్ వచ్చేస్తోంది

  • గతంలో హిట్ కొట్టిన 'పందెం కోడి'
  • దసరాకి వస్తోన్న సీక్వెల్ 
  • నాయికగా కీర్తి సురేశ్    
తెలుగులో విశాల్ కి మొదటిసారిగా క్రేజ్ తీసుకొచ్చిన సినిమా 'పందెం కోడి'. ఈ సినిమా మాస్ హీరోగా ఇక్కడ కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అలాంటి ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందింది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటించగా, నెగెటివ్ షేడ్ కలిగిన పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ చేసింది.

దసరా పండుగ సందర్భంగా తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. టీజర్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'పందెం కోడి'కి మించి 'పందెం కోడి 2' సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో విశాల్ వున్నాడు.      
vishal
keerti suresh

More Telugu News