'ప్రగతి నివేదన సభ'కు అంతమందొస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా: వీహెచ్ సవాల్

షార్ట్స్‌లో చూడండి
వచ్చే నెల 2న జరగనున్న ప్రగతి నివేదన సభకు 25 లక్షల మంది వస్తారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీ-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) మాట్లాడుతూ, టీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగా ఈ సభకు అంతమంది వస్తే కనుక, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, కేటీఆర్ ను సీఎం చేయడానికే ‘ముందస్తు’ అంటున్నారని, అయినా, ‘ముందస్తు’కు వెళ్లిన వాళ్లెవరూ గెలవలేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
vh
KTR

More Telugu News