‘పేపర్ బాయ్’ ట్రైలర్ ఫ్రెష్ గా.. ప్లెజెంట్ గా ఉంది: హీరో మహేష్ బాబు ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘పేపర్ బాయ్’ ట్రైలర్ ఫ్రెష్ గా.. ప్లెజెంట్ గా ఉంది: హీరో మహేష్ బాబు ప్రశంసలు

  • ‘పేపర్ బాయ్’ చిత్రం ట్రైలర్ చూశాను
  • టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నా
  • మహేష్ బాబు ట్వీట్
జయశంకర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్, రియా సుమన్, తన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పేపర్ బాయ్’. ఈ చిత్రం ట్రైలర్ పై ప్రముఖ హీరో మహేష్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రం ట్రైలర్ చూశానని, ‘ఫ్రెష్ గా..ప్లెజెంట్ గా’ ఉందని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. సంతోష్ తండ్రి దివంగత శోభన్ గారితో కలిసి తాను గతంలో పని చేశానని, సంతోష్ శోభన్ తో పాటు అతని టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నట్టు మహేష్ తెలిపాడు. కాగా, సంపత్ నంది నిర్మాణ సారధ్యంలో నిర్మిస్తున్న ‘పేపర్ బాయ్’ కు భీమ్స్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ట్రైలర్ గత శనివారం విడుదలైంది.
paper boy
Mahesh Babu

More Telugu News