నా నిర్మాతలు నాకు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు: విజయ్ దేవరకొండ
- బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదు
- ఒకవేళ వెళ్లాలన్నా గట్టి పాత్ర దొరకాలి
- వేరే పరిశ్రమకు వెళ్లకుండా నా నిర్మాతలు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు
దక్షిణాది నిర్మాతలు తనను వదులుకోవాలని అనుకోవడం లేదని విజయ్ తెలిపాడు. నా స్నేహితులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి తాను బ్రెయిన్ వాష్ చేస్తానని... ఎందుకంటే పెళ్లైన తర్వాత ఎప్పుడూ ఇంటి బాధ్యతలే గుర్తుకు వస్తుంటాయని చెప్పాడు. ఇదే విధంగా తన నిర్మాతలు కూడా తనను వేరే సినీపరిశ్రమకు వెళ్లకుండా బ్రెయిన్ వాష్ చేస్తుంటారని చెప్పాడు.