పాక్ ప్రధానులను మోదీ ఆలింగనం చేసుకోలేదా?: సిద్ధూకు మద్దతుగా నిలిచిన బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా
- బీజేపీని నేను ఎప్పుడూ విమర్శించలేదు
- పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యంకాదనే విషయాన్ని నేను వాజపేయి, అద్వానీ నుంచి నేర్చుకున్నా
- సిద్ధూ అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదు
కోల్ కతాలో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ కామెంట్ చేయలేదని, పార్టీకి అద్దంలా వ్యవహరించానని చెప్పారు. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన పార్టీని విమర్శించినట్టు కాదని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీనే గొప్పదని తాను వాజపేయి, అద్వానీ, నానాజీ దేశ్ ముఖ్ ల నుంచి నేర్చుకున్నానని చెప్పారు. జీఎస్టీ మూలంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు.