సిద్ధూపై ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్
- శాంతికి బ్రాండ్ అంబాసడర్ సిద్ధూ
- సిద్ధూను విమర్శిస్తున్న వారంతా శాంతికి విఘాతం కలిగిస్తున్నారు
- శాంతి లేకుండా మన ప్రజలు అభివృద్ధి చెందలేరు
మరోవైపు తనపై వస్తున్న విమర్శలను సిద్ధూ కొట్టిపడేశారు. తాను రాజకీయాల కోసం పాక్ వెళ్లలేదని... తన మిత్రుడి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హజరయ్యేందుకు వెళ్లానని చెప్పారు. గతంలో దివంగత వాజపేయి కూడా పాకిస్థాన్ వెళ్లారని... 2015లో ఎలాంటి అధికారిక షెడ్యూల్ లేకుండానే మోదీ లాహోర్ లో దిగి, నవాజ్ షరీఫ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ విషయంపై మోదీని ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.