vijay devarakonda: 'గీత గోవిందం' విజయోత్సవ వేడుక .. ముఖ్య అతిథిగా మెగాస్టార్

షార్ట్స్‌లో చూడండి
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై .. బన్నీవాసు నిర్మాతగా 'గీత గోవిందం' చిత్రం తెరకెక్కింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ భారీ వసూళ్లను సాధిస్తూ విజయ విహారం చేస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ విజయోత్సవ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకుంది. రేపు (ఆదివారం) హైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో విజయోత్సవ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకానున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన 'బిగ్ బాస్ 2' హౌస్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. చెప్పుకోదగిన సినిమాలేవీ దగ్గర్లో విడుదల కావడం లేదు. దాంతో మరో 10 రోజుల వరకూ 'గీత గోవిందం' వసూళ్ల జోరు కొనసాగనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News