adavi sesh: 'గూఢచారి' వసూళ్లపై గోవిందుడి ప్రభావం!

షార్ట్స్‌లో చూడండి
అడవి శేష్ హీరోగా రూపొందిన 'గూఢచారి' ఈ నెల 3వ తేదీన విడుదలై తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా తన దూకుడు చూపిస్తూ వస్తోంది. ఈ స్పై థ్రిల్లర్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అడవి శేష్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'గూఢచారి'ని గురించి చెప్పుకుంటున్నారు.ఓవర్సీస్ లో ఈ సినిమా 0.7 మిలియన్ డాలర్ల వసూళ్లతో స్ట్రాంగ్ గా వుంది. 1 మిలియన్ మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అనుకునే సమయంలోనే 'గీత గోవిందం' వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'గీత గోవిందం' జోరు కొనసాగుతోంది. ఇక ఓవర్సీస్ లోను 'గీత గోవిందం' ఒక రేంజ్ లో సందడి చేస్తూ 'గూఢచారి' వసూళ్లపై ప్రభావం చూపుతోంది. దాంతో నేరుగా ప్రమోషన్స్ చేస్తూ 'గూఢచారి' వసూళ్లు పెంచాలనే ఉద్దేశంతో, ఈ సినిమా టీమ్ ఈ రోజు నుంచి 26వ తేదీ వరకూ న్యూ జెర్సీ .. డెలాయిట్ .. డల్లాస్ .. షికాగో .. సియాటెల్ ప్రాంతాల్లో పర్యటించనుంది.    
Go Back to Shorts
adavi sesh
vijay devarakonda

More Telugu News